![]() |
![]() |

బుల్లితెర మీద లేడీ కమెడియన్ గా పాగల్ పవిత్ర అంటే తెలియని వారు లేరు. అందరినీ నవ్వించే పవిత్ర త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది. దానికి సంబంధించి ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫోటోలు షేర్ చేసింది. సంతోష్ వేలికి ఉంగరం చూపించి ఎంగేజ్మెంట్ చేసుకున్నాం అన్నట్లుగా కొన్ని పిక్స్ ని పోస్ట్ చేసింది. అలాగే ఒక హార్ట్ టచింగ్ కాప్షన్ ని జోడించింది. " ఫైనల్ గా నా జీవితంలో మంచి రోజులు వచ్చాయి.
నేను సంతోష్ ప్రేమను అంగీకరించాను. .మా జీవితంలో మేము కలుసుకున్న క్షణాలు చాల ప్రత్యేకమైనవి అవి మా చిన్న గుండెల్లో ఎప్పుడూ మెమొరీస్ గా ఉండిపోతాయి. ఇన్నాళ్ల నిరీక్షణ ముగిసింది.. ఒక ఏడాది పాటు నా కోసం వేచి ఉండి..నన్ను జాగ్రత్తగా చూసుకోవడంతో పాటు చాల ఓపికగా నా కోసం ఎదురు చూడడం చాల సంతోషంగా ఉంది..నా కోసం ఇంతగా ప్రయత్నించినా నీ ప్రేమకు చాలా ధన్యవాదాలు..సంతోష్ నా జీవితంలో భాగమైపోయాయి.. నా చివరి శ్వాస వరకు నేను మీకు అండగా ఉంటాను..ఇక నుండి అన్ని అడ్డంకులను చిరునవ్వుతో కల్సి ఎదుర్కొందాం.. నన్ను ఒక యువరాణిలా భావించి నన్ను జాగ్రత్తగా చూసుకున్నావా..నన్ను ఆదరించిన నా కుటుంబ సభ్యులు మరియు స్నేహితులకు ప్రత్యేక ధన్యవాదాలు". ఇక లాస్ట్ ఇయర్ సంతోష్ శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజి మీద ఆమెకు తెలియకుండా సర్ప్రైజ్ గా వచ్చి లవ్ ప్రొపోజ్ చేసాడు.
కానీ పవిత్ర మాత్రం అప్పుడు ఏ సమాధానమూ చెప్పలేదు. కాస్త ఆలోచించుకోవాలి అని తప్పుకుంది. తర్వాత సంతోష్ తో కలిసి వాలంటైన్స్ డే సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు హాజరై అక్కడ లవ్ ప్రపోజ్ చేసింది. ఆ తర్వాత అన్ని షోస్ లో పవిత్ర తనతో పాటు సంతోష్ ని కూడా వెంటబెట్టుకుని మరీ వచ్చేస్తోంది. ఇక ఇప్పుడు రీల్ లవ్ కాస్త రియల్ లవ్ అయ్యింది. ఇక నెటిజన్స్ కూడా వీళ్ళ లవ్ కి విషెస్ చెప్తున్నారు.
![]() |
![]() |